కరివేపాకుతో ఇలా చేస్తే జన్మ లో జుట్టు రాలమన్న రాలదు…ఇది నిజం
Hair Fall Tips in telugu :ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో (Hair Fall)చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్య ఆడవారి లోనే కాకుండా మగవారిలో కూడా ఉంది. జుట్టు రాలడానికి పోషకాహార లోపం, టెన్షన్, ఒత్తిడి, చుండ్రు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. జుట్టు రాలే సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు.
మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్య ను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో కరివేపాకు,ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య,తలలో దురద వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.