సమరసింహారెడ్డి సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో…?
samarasimha reddy movie : లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. బాలయ్య సరసన సిమ్రాన్, అంజలా జవేరీ నటించగా, మణిశర్మ సంగీతం ఉర్రూతలూగించింది. 1999 జనవరి 13 న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాలయ్య ఫాన్స్ నే కాదు, జనానికి కూడా బాగా కనెక్ట్ అయింది.
ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ అనూహ్యంగా 16 కోట్లు రాబట్టింది. 122 కేంద్రాలలో 50 రోజులు, 32 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ మూవీ 29 కేంద్రాలలో 175 రోజులు, 3థియేటర్లలో 227 రోజులు ఆడింది. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా బి గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందు కున్నారు.
అయితే ఈ మూవీకోసం ముందుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలని హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే రాశి సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ సెలెక్ట్ చేశారట. ఇక సిందూరపువ్వు తమిళ మూవీ మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ రాసుకోగా, అయన దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహాతో రాయలసీమ ఫాక్షన్ ని జత చేశారు. సమరసింహారెడ్డి మూవీ వచ్చి 23ఏళ్ళు అయింది. బాలయ్య, మణిశర్మ కాంబోలో వచ్చిన తొలిచిత్రం ఇదే.