అరటి పండ్లు ఎక్కువగా తింటున్నారా… అయితే ఎన్ని సమస్యలు వస్తాయో…అసలు నమ్మలేరు

Banana Side Effects :అరటిపండు అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా తింటారు.అరటి పండు తియ్యని రుచి కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది .ఎన్నో పోషకాలు ఉన్నాయి. అరటి పండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే డాక్టర్ రక్తపోటు సమస్య ఉన్న వారిని రోజుకు ఒక అరటిపండు తినమని చెబుతారు.
banana benefits in telugu
అరటి పండులో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట నీరసం ఉన్నప్పుడు ఒక అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు ఒక అరటి పండు తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే అరటి పండులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు.
gas troble home remedies
ఎక్కువగా అరటి పండ్లు తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అరటి పండులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. .ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడుతుంది అంతేకాకుండా ఇతర ఆహారాలు నుండి పోషకాలను గ్రహించి శక్తి తగ్గుతుంది.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నప్పుడూ బాగా పండిన అరటిపండులను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అరటిపండ్లు పండే కొద్దీ గ్లైసెమిక్ ఇండెక్స్ రెట్టింపు అవుతుంది. కాబట్టి అరటిపండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే తినాలి. అరటిపండును ఎక్కువగా తింటే దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
Acidity home remedies
అరటిపండును ఎక్కువగా తింటే కడుపు నొప్పి,మలబద్దకం, గ్యాస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి . కాబట్టి రోజులు రెండు అరటి పండ్లను మించి తినకూడదు. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి అరటిపండు తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.