ఈ ఆయిల్ వాడి చూడండి… జీవితంలో జుట్టురాలే సమస్య ఉండదు
Hair Fall Tips In telugu : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్యతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కోసం మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే సహజసిద్ధంగా నూనె ను తయారు చేసుకొని వారంలో రెండుసార్లు వాడితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది. జుట్టు పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
ఈ నూనె తయారీ కోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతులు 3 గంటలు నానబెట్టాలి. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇక తయారీ విధానం ఎలా అంటే…ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకు మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి.
ఈ పేస్ట్ ను ఐరన్ పాత్రలో వేసి ఒక కప్పు ఆవనూనె ఒక కప్పు కొబ్బరి నూనె వేసి చిన్నమంటపై మరిగించాలి. దాదాపుగా పది నిమిషాల పాటు మరిగించి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ ఆయిల్ కి 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను కలపాలి.
ఈ నూనెను ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.ఈ నూనెను వారంలో రెండు సార్లు ఉపయోగించాలి. ఉపయోగించటానికి గంట ముందు ఈ నూనెను ఫ్రిజ్ లోంచి బయటపెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసుకుని జుట్టుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది అలాగే జుట్టుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.