వేసవి తాపాన్ని తగ్గించే తాటి ముంజలను తింటున్నారా…. ఈ నిజాలను తెలుసుకోండి
Taati munjalu : వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించటానికి ముంజులు ఒక ఔషధంగా పనిచేస్తాయి. తెల్లగా మెరుస్తూ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉండే తాటి ముంజులను వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరు ఇష్టంగా తింటారు. తాటి ముంజలను ఐస్ యాపిల్స్ అని పిలుస్తారు.
తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబో ప్లేవిస్, నియాసిస్ వంటి బీ కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు.
అరటిపండులో ఎంత పొటాషియం ఉంటుందో తాటి ముంజులలో కూడా అంతే మొత్తంలో పొటాషియం ఉంటుంది. అందువల్ల తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఎండాకాలంలో మన శరీరంలో నీరు వేగంగా ఖర్చవుతుంది. ఈ క్రమంలో మనం డీహైడ్రేషన్ బారిన పడతాం. అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజలను తింటే శరీరంలోకి ద్రవాలు వచ్చి చేరతాయి. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా ముంజలను తినవచ్చు. తాటి ముంజలలో ఉండే పొటాషియం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వేసవిలో ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ముంజలను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
లేత తాటిముంజల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండుట వలన శరీరానికి తగినంత తేమను అందించి, చర్మాన్ని, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.