పుదీనా+నిమ్మకాయ కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Pudina And Lemon : పుదీనా,నిమ్మకాయలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. ప్రతి రోజు ఉదయం నీటిలో పది పుదీనా ఆకులను వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి దానిలో అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి.

పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచటమే కాకుండా వేసవిలో అలసట,నీరసం లేకుండా చేస్తుంది. అధిక బరువు మరియు పొత్తికడుపు కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే దగ్గు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయపడుతుంది.
Pudina Health benefits in telugu
జీర్ణ సంబంద సమస్యలతో బాధపడేవారికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి,డిప్రెషన్ వంటివి లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో అలసట లేకుండా శక్తివంతంగా ఉషారుగా ఉండేలా చేస్తుంది. నోటి దుర్వాసన,దంత క్షయం వంటి సమస్యలు లేకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.