15 వంటింటి ఆరోగ్య చిట్కాలు…మిస్ కాకుండా చూడండి

Kitchen Tips In telugu:వంటింటిలో పని సులువుగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే సమయం కూడా చాలా అదా అవుతుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

1. అల్లంలో ఉన్న ఔషధ గుణాలు పొట్టలో గ్యాస్ ని బయటకు పంపిస్తుంది. దాంతో కడుపు ఉబ్బరం మరియు కడుపు నొప్పి వంటివి తగ్గిపోతాయి. 

2. ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ అల్లం నీటిలో తేనే కలుపుకొని రోజులో రెండు సార్లు త్రాగితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. 

3. ప్రతి రోజు అల్లంను ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. 
Ginger benefits in telugu
4. అల్లం అధికబరువుని తగ్గించి, చెడుకొలెస్ట్రాల్‌ని దూరం చేసి, రక్త ప్రసరణ సరిగా ఉండేలా చూసి గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.

5. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

6. వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోతాయి. మళ్లీ వాటిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఒక గ్లాసు అల్లం నీటిని  వ్యాయామం తరువాత తాగాలి. చాలా తక్కువ సమయంలోనే ఫలితం కనిపిస్తుంది.

7.  తులసి ఆకులను యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా చెప్పవచ్చు. రోజులో రెండు సార్లు 5 తులసి ఆకులను తింటే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను నమలడం వలన రక్తం శుద్ధి అవుతుంది. 
Tulasi Health benefits in telugu
8.  తులసి ఆకులలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటికి సమందించిన సమస్యలు రావు. 

9.  ఉదయం పరగడుపున 5 తులసి ఆకులను తింటే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే కరిగిపోతాయి. 4. తులసి ఆకుల టీ తలనొప్పికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 

10.  తీసుకున్న ఆహారం వల్లగానీ, శరీరంలోని వేడి ఎక్కువగా ఉన్నప్పుడు  నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే తాజా స్వాస వచ్చి… నోటి దుర్వాసన పోతుంది. 
Diabetes tips in telugu
11.  లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని ఇవి తగ్గిస్తుంది. 

12. మధుమేహ వ్యాధి కలిగి ఉన్న వారు రోజు కరివేపాకు ఆకులను తినటం వలన వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మూడు నుండి నాలుగు నెలల పాటూ కరివేపాకు ఆకులను నలిపి మింగటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

13. దాల్చిన చెక్కతో యాంటీ  బ్యాక్టీరియల్ గుణాలు ఉండుట వలన రక్తప్రసరణలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి, వ్యాధి గ్రస్త కారకాలకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తుంది

14.  దాల్చిన చెక్కలో యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని రక్షిస్తుంది.యాంటీ-సెప్టిక్ గుణాలు ఉండుట వలన గాయాలకు ముందుగా పనిచేస్తుంది. 
weight loss tips in telugu
15. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.