ఒక స్పూన్ నూనె 15 రోజుల్లో మీ జుట్టును ఒత్తుగా,పొడవుగా చేయటం ఖాయం
Hair fall control oil at home In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనపడుతుంది. జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీని కోసం కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె ఏదైనా వాడవచ్చు. ఒక గిన్నె పెట్టి దానిలో 100 గ్రాముల కొబ్బరి నూనె వేసి దానిలో రెండు మందార పువ్వులను కింద తొడిమలు,పుప్పొడి కాడలను తీసేసి వెయ్యాలి. నూనెలో మందార పూలు బాగా వేగే వరకూ మరిగించాలి.
మందార పువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక నూనెను వడగట్టాలి. ఈ నూనెను మనం నార్మల్ గా రాసుకొనే నూనెకు బదులుగా ప్రతి రోజు రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే తలలో కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా తల మీద చర్మం మీద తగినంత తేమ ఉండి చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పాలి.
మందార పువ్వులను పురాతన కాలం నుండి జుట్టు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ నూనెను రెగ్యులర్ గా రాసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. ఈ నూనె కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.