ముగ్గురు మొనగాళ్ళులో చిరుకి డూప్ గా నటించింది ఎవరు?

Mugguru Monagallu Movie :దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఘరానామొగుడు బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావుతో మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తీసిన ముగ్గురు మొనగాళ్లు మూవీలో చిరంజీవి మూడు పాత్రలు వేశారు. మాటల రచయిత సత్యానంద్, రాఘవేంద్రరావు, చిరంజీవి కల్సి సాయిశక్తుల కృషిచేసి ముగ్గురు మొనగాళ్లే అని నిరూపించుకున్నారు.

సీరియస్ నెస్ తో ఉండే పృథ్వి పాత్రతో సినిమాకి ఆయువు పట్టు. క్లాసికల్ డాన్స్ అంటే కూడా ఇష్టం కనుక దత్తాత్రేయ పాత్ర కూడా బాగానే చేసాడు. ఈ పాత్రలో భాష కూడా ఫాన్స్ కి బాగా నచ్చేసింది. సినిమాకు బ్రిడ్జి లాంటిది పోలీసాఫీసర్ పాత్ర. ఈ మూవీలో ఈ మూడు పాత్రలు కలుస్తాయి.
Chiranjeevi Mugguru Monagallu
డైనింగ్ టేబుల్ దగ్గర సృష్టించిన సీన్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు. మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడంలో అభిమానులకు ఖుషి ఉన్నా, అలా చూపించడానికి తెరవెనుక ఎంతో కష్టం ఉంటుంది. చిరు దగ్గర పనిచేసే సుబ్బారావు, నటుడు ప్రసాద్ బాబు చిరుకి డూప్ గా నటించారు. ఇద్దరిదీ చిరంజీవి పర్సనాలిటీ కావడం విశేషం.