వారంలో 2 సార్లు 2 నెలలు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Hair loss tips in telugu : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య ప్రారంభం అవుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Green Tea Brain Health Benefits
కాబట్టి జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి స్పూనున్నర టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగొట్టాలి. టీ డికాషన్ జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
lemon benefits
మరిగిన టీ డికాషన్ ని ఒక బౌల్లో వడకట్టి దానిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూ కలపాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం కలపాలి. నిమ్మలో ఉన్న గుణాలు తలలో చుండ్రు సమస్య తగ్గించడమే కాకుండా తల మీద చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే అది జుట్టురాలే సమస్యకు కారణం అవుతుంది.
hair fall tips in telugu
Tea డికాషన్లో షాంపూ,నిమ్మరసం రసం వేసి బాగా కలిపిన ఈ నీటితో వారంలో రెండు సార్లు తల స్నానం చేయాలి. ఈ విధంగా రెండు నెలలపాటు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.