2 నిమిషాల్లో నల్లని మచ్చలు లేకుండా ముఖం తెల్లగా,కాంతివంతంగా మారాలంటే…
Tomato Face Glow Tips In telugu : ప్రతి ఒక్కరు ముఖం తెల్లగా అందంగా ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత కష్టపడటానికి అయినా సిద్ధపడతారు. అలాగే ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్ధపడతారు. ముఖం మీద నల్లని మచ్చలు,తాన్,దుమ్ము,ధూళి కారణంగా నల్లగా మరియు నిస్తేజంగా మారుతుంది.
ఇలా నల్లగా నిస్తేజంగా మారిన ముఖం తెల్లగా ప్రకాశవంతంగా మారటానికి ఒక మంచి చిట్కా ఉంది. ఆ చిట్కాకు పెద్దగా ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం లేదు. అలాగే ఉపయోగించే ఇంగ్రిడియన్స్ కూడా మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. కేవలం మూడు ఇంగ్రిడియన్స్. ఉపయోగించి నల్లగా నిస్తేజంగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, అరస్పూన్ పంచదార వేసి బాగా కలిపి దానిలో సగానికి కట్ చేసిన టమోటా ముక్కను డీప్ చేసి ముఖం మీద రుద్దాలి. ఈ విధంగా ముఖం అంతా రుద్ది పావుగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని సహజమైన బ్లీచింగ్ గా పనిచేసి నలుపును తొలగిస్తుంది. అంతేకాక ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కాఫీ, పంచదారలో ఉన్న లక్షణాలు చర్మంలోని మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మరుస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.