త్రినయని సీరియల్ తిలోత్తమ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Trinayani Serial Thilottama : బుల్లితెరలో ప్రతి రోజు ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ఆ సీరియల్స్ అభిమానుల మనస్సును ఆకట్టుకుంటున్నాయి. జీ తెలుగులో వచ్చే త్రినయని సీరియల్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్లో నటించే తిలోత్తమకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఆమె నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. త్రినయని సీరియల్ లో తిలోత్తమ పాత్రను పవిత్ర జయరాం పోషించారు. ఈమె ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో పడిన కష్టాలు గురించి చెప్పింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన పవిత్ర మొదటిసారిగా కన్నడ సీరియల్స్ లో చిన్ని చిన్ని పాత్రలను చేసింది. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్ళాడుతా సీరియల్లో అవకాశం వచ్చింది.
ఆ సమయంలో తెలుగు రాకపోయినా.. అర్థం కాకపోయినా… తోటి నటీనటుల సహకారంతో ముందడుగు వేసింది. ఆ సీరియల్ హిట్ కావటంతో వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది. పవిత్ర సీరియల్స్ కి రాకముందు కొన్ని రోజులు హౌస్ కీపింగ్ చేసింది. ఆ తర్వాత బట్టల దుకాణంలో, లైబ్రరీలో కూడా పనిచేసింది. ఇక ఇప్పుడు చాలా హ్యాపీగా సీరియల్స్ చేస్తుంది.