ఉసిరితో నూనెను ఇలా తయారుచేస్తే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు అసలు రాలదు
Amla Hair Oil : ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య,తెల్ల జుట్టు సమస్య,చుండ్రు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో వేదిస్తూనే ఉన్నాయి. వీటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలోనే సహజసిద్దంగా నూనెను తయారుచేసుకోవచ్చు.
ఉసిరిని జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఉసిరిలో ఉండే విటమిన్ సి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఉసిరీలో కెరోటిన్, ఐరన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకి అవసరమైన పోషణను అందించి జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం వంటివి తగ్గుతాయి.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల దురద, ఇన్ఫెక్షన్స్ పొగొట్టి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. ఇక నూనె విషయానికి వస్తే…15 ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
200 Ml కొబ్బరినూనెలో ఉసిరి పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టి 7 నుంచి 10 నిమిషాల వరకు మరిగించాలి. అప్పుడే ఉసిరిలో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఈ నూనెలో రెండు స్పూన్ల ఆలోవెరా జెల్ కలిపి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. మీ జుట్టుకు సరిపడా నూనెను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా వేడి చేసి జుట్టుకి పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.