Kitchenvantalu

Puri;పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా బాగా పొంగాలంటే పిండిని ఇలా కలిపితే సరి

How to Make Puffy Poori in telugu:ఉదయం సమయంలో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ సమయంలో హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీ, వడ, దోస వంటివి చేయాలంటే ముందుగానే పిండిని సిద్ధం చేసుకోవాలి.

అదే చపాతీ,పూరి వంటి వాటిని పిండి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు. పూరీలు అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పూరీలు మెత్తగా బాగా పొంగేలా నూనె పీల్చకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించాలి.

పూరీలు తయారు చేయడానికి పిండిని మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా పిసికి బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పూరి పొంగటమే కాకుండా నూనె ఎక్కువగా పీల్చుకోదు. అలాగే పిండిని ముందు రోజు కలిపితే ఎక్కువ నూనెను పీల్చుకుంటుంది.

అలాగే పొంగే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకే పూరీలను తయారు చేసుకోవడానికి అరగంట ముందు మాత్రమే పూరీ పిండిని కలుపుకోవాలి.అలాగే శుద్ధి చేసిన లేదా సోయాబీన్ వంటి తేలికపాటి నూనెలను వాడితే పూరీలు ఎక్కువగా నూనెను పీల్చుకోవు.

పూరీలను వేగించినప్పుడు నూనె చాలా వేడిగా లేదా చాలా చల్లగా లేకుండా మీడియం వీడిలో ఉండేలా చూసుకోవాలి.అంతే కాకుండా పూరీలను వేగించినప్పుడు ఆ నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే వేగించే నూనెలో కొంచెం ఉప్పు వేయాలి.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది.అదే ఉప్పు ఎక్కువైతే పూరీలు ఉప్పును పీల్చుకొని ఉప్పగా తయారవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.