Kitchen

నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు…డోంట్ మిస్

Kitchen Tips in telugu:మనం సాదారణంగా నిమ్మకాయలను నిమ్మరసం తీసేసాక నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. అలా కాకుండా నిమ్మ తొక్కలను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆవిరి మీద ఉడికించి ఉప్పు,కారం కలిపి పోపు పెడితే నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది…అలాగే మంచి రుచిగా ఉంటుంది.

దోసెల పిండి రుబ్బినప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి రుబ్బితే దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి.

దోసెలు పెనానికి అతుక్కోకుండా బాగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. దోసె వేయటానికి ముందు పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి.

కేక్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలపాలి.

కొత్తగా కొన్న జామ్ సీసా మూత గట్టిగా ఉండి తియ్యడానికి రాకపోతే, మూతను మంటమీద కొద్దిగా వేడి చెయ్యండి.

జామ్ గడ్డకడితే, దానిలో బాగా వేడిచేసిన నీరు నాలుగు చెంచాలు పోస్తే మెత్తబడుతుంది