Kitchenvantalu

పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత చేతుల మంట నిమిషంలో తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Chili Cutting Tips: మనం ప్రతిరోజు వంటలలో పచ్చి మిరపకాయలను వాడుతూ ఉంటాం. వంటలలో పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాడుతూ ఉంటాం. అలా పచ్చిమిర్చిని కోసిన తర్వాత చేతులు మండుతాయి. అలా మంట లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
kalabanda benefits in telugu
పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులను శుభ్రంగా కడిగి కొంచెం అలోవెరా జెల్ రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే మంట నుండి ఉపశమనం కలుగుతుంది.

పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత చపాతీ పిండి వంటి వాటిని కలిపితే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. పచ్చిమిర్చి కారణంగా వచ్చే చికాకు నుండి బయటపడవచ్చు.
curd benefits in telugu
పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులకు ఆయిల్ రాసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే చల్లని పెరుగును చేతులలో వేసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. పచ్చిమిర్చి కోసినప్పుడు మంట రాకుండా ఉండాలంటే చేతి తొడుగులు(gloves) ఉపయోగిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.