వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Milk:సీజన్ తో సంబంధం లేకుండా చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఇలా ఏ సీజన్ అయినా ప్రతి రోజు మనం పాలు వాడుతూనే ఉంటాం. పెద్దవారైతే కాఫీ, టీ తాగుతూ ఉంటారు. పిల్లలు అయితే ప్రతిరోజు పాలు తప్పనిసరిగా తాగాలి. వేసవి కాలంలో పాలు తరచుగా విరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ సమయం నిల్వ ఉండవు.

పాలను విరిగిపోకుండా ఎక్కువ సమయం నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే సరిపోతుంది. పాలను ఫ్రిజ్లో పెడుతూ ఉంటాం. ఫ్రిజ్లో నుంచి పాలు బయటికి తీసినప్పుడు దాని ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాని కారణంగా పాలు విరిగిపోతూ ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే ఉష్ణోగ్రత వేడి పెరిగినా కూడా పాలు విరగకుండా తాజాగా ఉంటాయి.
milk
పాలను బాగా మరిగించి చల్లారాక గాజు సీసా లేదా జగ్గులో నిలువ చేసి ఫ్రిజ్లో పెట్టాలి. అలాగే బాటిల్ కి మూత పెట్టడం మర్చిపోకూడదు ఈ విధంగా చేయడం వలన పాలు విరగకుండా తాజాగా ఉంటాయి. పాలను నిలవ చేయటానికి ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలలో పాలను నిల్వ చేసి ఫ్రిజ్లో పెడితే మూడు నుంచి నాలుగు రోజులు వరకు నిల్వ ఉంటాయి.

స్టీల్ పాత్రలో కూడా పాలను నిల్వ చేయవచ్చు. అయితే స్టీల్ పాత్రలో పాలను నిల్వ చేసే ముందు పాత్రను శుభ్రంగా కడగాలి. ఈ చిట్కాలను పాటిస్తే వేసవి కాలంలో పాలు తాజాగా నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.