కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి టేస్ట్‌ అదిరిపోతుంది

How to Decrease salt in curries:సాధారణంగా మనం వంట చేసినప్పుడు ఉప్పు కాస్త ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. వంటలో ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే వంటకు రుచి చూస్తుంది.

పులుసులు, సూపు వంటివి చేసినప్పుడు ఉప్పు ఎక్కువగా పడితే దానిలో ఒక స్పూన్ పాలు లేదా పెరుగు కలిపితే సరిపోతుంది. లేదంటే ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చేసి కలపాలి. బంగాళదుంపలో ఉండే స్టార్చ్ వంటలో ఎక్కువైనా ఉప్పును పీల్చుకుంటుంది.
Potato
కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే.. 2 లేదా 3 స్పూన్ల పెరుగును కలపాలి. కూరలో ఉప్పు తగ్గటమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది. పెరుగు అంటే ఇష్టపడని వారు మీగడను కలపవచ్చు. కొన్ని కూరల్లో పాలు పోసినా దాని టేస్ట్‌ పెరుగుతుంది. ఒకవేళ కూరలో ఉప్పు ఎక్కువైతే.. కొన్ని పాలు పోసి ఉడికించండి. కూర రూచి కూడా పెరుగుతుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఉల్లిపాయ,టమోటా పేస్ట్ కలిపితే ఉప్పు తగ్గటమే కాకుండా కూర రుచి బాగా పెరుగుతుంది.కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు… గోధుమ పిండిలో కొద్దిగా నీరు పోసి.. ముద్దగా చేసుకోవాలి.దానిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని కూరలో వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.