బ్రహ్మముడి రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ గురించి ఈ విషయాలు తెలుసా..?

Brahmamudi telugu serial Sharmitha Gowda:బ్రహ్మముడి సీరియల్‌‌ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ పొంది సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సీరియల్‌లో మానస్‌కి అత్త పాత్రలో రుద్రాణి.. అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఈమె అసలు పేరు షర్మితా గౌడ.

అత్త పాత్రలో స్టైలిష్​గా కనిపించే ఈ భామ.. బయట కూడా ఫుల్ ట్రెండీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ఫుల్​ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. కన్నడ నటి అయినా షర్మితా బ్రహ్మముడి సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తమిళ సీరియల్స్ లో నటించి…ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం కన్నడ,తమిళ,తెలుగు సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది.