Healthhealth tips in telugu

పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తింటున్నారా… ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు

Onion Health benefits In telugu : ఉల్లిపాయను మనలో చాలా మంది పచ్చిగా తింటూ ఉంటారు. అయితే కొంతమంది ఉల్లిపాయ వాసన కారణంగా తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. మనం ప్రతి రోజు ఉల్లిపాయను కూరలో వేసుకుంటూ ఉంటాం. ఉల్లి లేనిదే కూర పూర్తి కాదు. అలాగే వంటకు మంచి రుచి వస్తుంది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెబుతుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు ఉల్లిపాయ కు దూరంగా ఉంటేనే మంచిది. అవి ఏమిటో తెలుసుకుందాం. పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రోటీన్, కేలరీలు, కాల్షియం, ఇనుము, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
Eating raw onion with meals health benefits telugu
వీటితో పాటు పచ్చి ఉల్లిపాయల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, అసెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. కాబట్టి రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉంటేనే మంచిది.
blood thinning
ఒకవేళ. ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఈ సమస్య తీవ్రం అయ్యి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.గర్భధారణ సమయంలో కూడా ఉల్లిపాయ .లిమిట్ గా తినాలి. ఎక్కువగా తింటే కడుపుబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. షుగర్ లెవెల్స్ తక్కువ ఉండే వారు కూడా ఉల్లిపాయ. ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ ఇంకా షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తుంది.
gas troble home remedies
ఉల్లిపాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల గుండె సమస్యలు ఉన్నవారు తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. ఉల్లిపాయలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉల్లిపాయను ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు ఉల్లిపాయ తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే పచ్చిగా తినకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.