రోజుకి 2 తింటే చాలు…ఎన్నో సమస్యలకు చెక్…ముఖ్యంగా ఈ సీజన్ లో…
walnuts Health benefits In Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మంచి పాషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. అలాంటి ఆహారాలలో డ్రై ఫ్రూట్స్ ఒకటి. మనలో ప్రతి ఒక్కరూ దాదాపుగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అలాంటి డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ ఒకటి. కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా ఫలితాలను అందిస్తుంది.
వాల్ నట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ సంరక్షణలోనూ జుట్టు సంరక్షణలోనూ సహాయపడుతుంది. వీటిలో ఇ, బి6 విటమిన్లు, మెలటోనిన్, పాలీఫినాల్స్, థయామిన్, పాస్ఫరస్ వంటివి సమృద్దిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇ విటమిన్ ఉండుట వలన ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాటం చేస్తుంది.
అందువలన వృద్ధాప్యఛాయలు ఆలస్యం అయ్యి చర్మం యవ్వనంగా ముడతలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. మిక్సీ జార్ లో నాలుగు వాల్‌నట్స్, రెండు చెంచాల ఓట్స్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ క్రీం, నాలుగు చుక్కల ఆలివ్‌నూనె వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
అలాగే వాల్‌నట్స్‌లో ఉండే బయోటిన్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇక ఇ విటమిన్ జుట్టును నల్లగా నిగనిగలాడేలా ఉంచి తెల్లజుట్టు రాకుండా కాపాడుతుంది. వాల్ నట్స్ లో ఉండే ప్రొటీన్లు, ఇ, బి6 విటమిన్లు, కాపర్ ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. వాల్ నట్స్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
వాల్‌నట్స్‌లోని పాలీఫినాల్స్, మేగా-3 కొవ్వు, మెగ్నీషియం, అమినోయాసిడ్ వంటివి ఆస్త్మా, కీళ్లనొప్పులు, మధుమేహం వంటి వాటికి కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌పై పోరాటం చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
వాల్‌నట్స్‌ను తీసుకున్నప్పుడు ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు, విటమిన్లు కడుపునిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తాయి. దీంతో అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు. ప్రతి రోజు రాత్రి సమయంలో 2 వాల్ నట్స్ ని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాల్ నట్స్ తొక్క తీసి తినాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.