మెంతులను ఇలా వాడితే జుట్టు రాలటం తగ్గి ఒక వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి
castor oil hair Loss Tips : జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యిపోయింది. జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అనేవి మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా రావటం వలన చాలా కంగారూ పడి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తున్నారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
దీని కోసం రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి. మెంతుల నీటిలో ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి.
ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా జుట్టు రాలే సమస్యను బట్టి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేస్తూ ఉండాలి. రెండు నెలల పాటు ఈ విధంగా చేస్తే చాలా మంచి ఫలితం కనపడుతుంది. మెంతులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఆముదం,ఆలోవెరా,ఆలివ్ ఆయిల్ లో ఉన్న పోషకాలు అన్నీ జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.