వయస్సు పెరిగిన ముడతలు లేకుండా ముఖం యంగ్ లుక్ లో కనపడాలంటే…ఎవరు చెప్పని సీక్రెట్

face mask to reduce wrinkles : మనలో చాలా మంది ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని యంగ్ లుక్ గా మార్చుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ వేరుశనగ, ఒక స్పూన్ నువ్వులను వేసి మూడు స్పూన్ల పాలను పోసి గంట సేపు నానబెట్టాలి.

నానిన తర్వాత మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి పాలను వడకట్టాలి. ఈ పాలతో ప్యాక్ తయారుచేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి పైన తయారుచేసుకున్న పాలను పోసి బాగా కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
besan
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. వేరుశనగలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. చర్మం యవ్వనంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నువ్వులు ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది.
peanuts side effects
శనగపిండి చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. అలాగే తేనె చర్మంపై తేమ ఉండేలా చేస్తుంది. ఆలోవెరా చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.