Healthhealth tips in teluguKitchen

భోజనం చేసిన తర్వాత ఈ జ్యుస్ త్రాగితే… ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు

Grape Juice Weight Loss Benefits in telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపతున్నారు. అధిక బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు లేకుండా బరువు తగ్గవచ్చు.
Weight Loss tips in telugu
బరువును తగ్గించటానికి నల్ల ద్రాక్ష చాలా బాగా సహాయపడుతుంది. ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి కీలకమైన విటమిన్లు, మినరల్స్ తో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని సైతం ఇస్తాయి. చాలా మందికి ఇంతవరకే తెలిసి ఉండొచ్చు.. కాని బరువు తగ్గేందుకు కూడా ద్రాక్ష దోహదం చేస్తుంది. భోజనం చేసిన ప్రతిసారి ద్రాక్షలతో తయారైన ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారని ప్రయోగాత్మకంగా రుజువైంది.

గుప్పెడు ద్రాక్షలను శుభ్రంగా కడిగి సగానికి కోయాలి. వాటిల్లో నుంచి గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ద్రాక్షలను పండించేందుకు ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులను కొడుతున్నారు. అందుకే పైన తొక్కను తొలగించడమే సేఫ్. ద్రాక్ష గుజ్జు, ఒక స్పూన్ తేనె, ఒక కప్పు నీటిని పోసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అంతే మ్యాజిక్ డ్రింక్ రెడీ. భోజనం చేసిన 20 నిమిషాల తర్వాత తాగాలి.

ఈ మ్యాజిక్ డ్రింక్ కు మీరు అప్పుడే తీసుకున్న భోజనానికి చెందిన సగం క్యాలరీలను బర్న్ చేసే కెపాసిటీ ఉంది. శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుండే ఈ డ్రింక్ లో పెక్టిన్, లైకోపిన్ అనే ప్రయోజనకర పోషకాలున్నాయి. పెక్టిన్ అనే పీచుపదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇన్సులిన్ ను తగ్గిస్తుంది. జీవక్రియ (మెటబాలిజం)ను నియంత్రిస్తుంది.

అంతే కాదు హై బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటుగా బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ తీసుకోవటం వలన బరువు తగ్గటమే కాకుండా సీజనల్ గా వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ చలికాలంలో వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవటానికి నల్ల ద్రాక్ష జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.