కారంలో కల్తీని తెలుసుకోవడం ఎలా..మీ ఇంట్లోనే ఈ ప్రయోగం చేయొచ్చు.. ఇది చాలా ఈజీ..

Chilli Powder Adulterate :మనం ప్రతి రోజు వాడే నిత్యావసర వస్తువుల నుండి కడుపులోకి వెళ్ళే తిను పదార్థాల వరకు అన్నిటిలోనూ కల్తీ జరగటం సర్వ సాధారణం అయ్యిపోయింది. ఉదయం వాడే టూత్ పేస్టు నుండి రాత్రి పడుకునేటప్పుడు వాడే దోమల మందు వరకు అన్నిటి పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి వాటి నుండి మిమల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబ సభ్యులను కూడా క్షేమంగా ఉంచాలంటే…. ఈ విషయం మీద ఒక లుక్ వేయండి.
Testing Chilli Powder
మనం రోజు తినే చాలా పదార్ధాలలో కారంని తప్పకుండా ఉపయోగిస్తాం. కొన్ని వంటలు రుచిగా ఉండాలంటే కారం కూడా ఎంతో అవసరం. అప్పుడప్పుడూ కారం తక్కువా ఎక్కువా అవుతుంటుంది. వంట సరిగ్గా చేయకపోవడమే దీనికి కారణం అనుకుంటాం….. కానీ దీనికి అసలు కారణం కల్తీ జరగటం అని గుర్తించలేము.

కారం లో కల్తీని తెలుసుకోవడం ఎలా?
ఒక గాజు గ్లాస్ లో నీటిని నింపి.. ఒక స్పూన్ లో కొంచెం కారంను తీసుకుని… నెమ్మదిగా ఆ నీటి పై జల్లాలి. ఒకవేళ కారం పలుకులుగా నీళ్ళలోకి మెల్లిగా జారుతుంటే అది మంచి కారం అని అర్థం.

అలాకాకుండా గ్లాసులో ఉన్న నీళ్ళు… మీరు జల్లిన కారం నుండి రంగును పీల్చుకుంటున్నటైతే… అది ఖచ్చితంగా కల్తీ కారం అని తేలిపోతుంది. ఇలాంటి కారం నుండి దూరంగా ఉండటం చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.