Eno తో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది
Eno Face Glow Tips : ముఖం మీద ఎటువంటి నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో ముఖం మెరిసేలా చేసుకోవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి, అరచెక్క నిమ్మరసం, ఒక eno పేకెట్ లో సగం పొడిని వేయాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల పాలను వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం నల్లగా మారిన చేతులు, కాళ్ళు, మెడను కూడా తెల్లగా మార్చటానికి సహాయపడుతుంది.
బియ్యం పిండి (rice flour) యొక్క గరుకుదనం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మంపై గల స్వేద రంధ్రాలలోని మురికిని, క్రిములను తొలగించి మొటిమలు(pimples) రాకుండా నివారిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వలన ఇది చర్మాన్ని శుభ్రపరిచి చర్మం మెరిసేలా చేస్తుంది.
పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లము (Lactic acid) చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. కలుషిత వాతావరణం (Polluted atmosphere) కారణంగా చర్మంలో పేరుకుపోయిన మురికిని, మృతకాణాలను బయటకు పంపించి చర్మాన్ని తాజాగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ సులభంగానే అందుబాటులో ఉంటాయి. Eno ను కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాడుతూ ఉంటాం. Eno లో ఉన్న లక్షణాలు ముఖం మీద మురికిని తొలగించటానికి సహాయపడతాయి. ఈ ప్యాక్ ని ట్రై చేసి మెరిసే తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకొండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.