ఈ నూనె జుట్టుకి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది…ఇది నిజం

Hair Fall Oil : జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మార్కెట్ లో ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఇంటిలో ఉండే కొన్ని పదార్ధాలతో నూనెను తయారుచేసుకొని వాడితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది.
Diabetes tips in telugu
దీని కోసం 100 గ్రాముల అల్లంను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో అల్లం ముక్కలు,రెండు స్పూన్ల లవంగాలు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. 300 ml కొబ్బరినూనెలో అల్లం,లవంగాల పేస్ట్ వేసి బాగా కలిపి పొయ్యి మీద డబుల్ బాయిలింగ్ పద్దతిలో బాగా మరిగించాలి.
Ginger benefits in telugu
ఇలా మరిగించటం వలన అల్లం,లవంగాలలో ఉండే రసాయనాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఈ నూనెను పల్చని గుడ్డ సాయంతో వడకట్టాలి. ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టుకి పట్టించి కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేయాలి. జుట్టుకి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేయాలి.

జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. ఈ నూనె ఒక మాయిశ్చరైజర్ గా పనిచేసి జుట్టు పగుళ్లను క్లియర్ చేస్తుంది. జుట్టు పొడిగా మారకుండా తేమగా,మృదువుగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.