సుధాకర్ పక్కన నటించి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసా?

Tollywood Hero Sudhakar:బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయని అంటారు కదా అది సినిమా వాళ్ళ జీవితంలో కూడా అక్షర సత్యం అవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోగా, స్టార్ కమెడియన్ గా రాణించి ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలించడంతో భార్య సంపాదనతోనే నెట్టుకెళ్ళాల్సిన పరిస్థితి స్టార్ కమెడియన్ సుధాకర్ కి వచ్చింది. ఇది చూసేవాళ్లకు చాలా బాధగా ఉంటుంది.

ఒకప్పుడు సుధాకర్ రూమ్ లోనే మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరు అప్ కమింగ్ నటులు కూడా ఉండేవారు. మద్రాసులో చెప్పులు అరిగేలా ఛాన్స్ ల కోసం తిరిగిన సుధాకర్ మొదట్లో తమిళంలో హీరోగా సక్సెస్ అయ్యాడు. హీరోగా పాతిక సినిమాల వరకూ తమిళంలో వేసాడు. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ ఇతడి పక్కన తొలి సినిమా ఛాన్స్ కొట్టేసినవాళ్ళే.

తమిళ డైరెక్టర్ భారతీరాజా అప్పట్లో శ్రీదేవితో 16ఏళ్ళ వయస్సు సినిమా తీసి, శ్రీదేవితో విజయం అందుకున్న సమయం. ఇక రెండో సినిమాకు సుధాకర్ ని హీరోగా పెట్టుకున్నాడు. ఆ సినిమాలో తమిళ నటుడు ఎం ఆర్ రాధా కూతురుగా శ్రీలంక లో పెరిగి, లండన్ నుంచి వచ్చిన రాధిక హీరోయిన్ గా వేసింది. అది సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలా మొదటి హీరోగా సుధాకర్ పక్కన వేసిన రాధికా తర్వాత రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది.

సుధాకర్ ,రాధికా జంటగా ఏకంగా 13తమిళ్ సినిమాల్లో నటించి హిట్ ఫెయిర్ గా నిలిచారు. ఇక సుధాకర్ తన మూడవ సినిమాలో సరిత హీరోయిన్. దాంతో ఆమె వందల సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటింది. ఇక పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసిన సుమతి తర్వాత సినిమాలో సుధాకర్ పక్కన హీరోయిన్. దాంతో ఆమె కూడా స్టార్ యాక్టర్ అయింది.

అంతెందుకు తెలుగులో లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి కి తోలి తమిళ హీరో సుధాకర్ కావడం విశేషం. కలుక్కు ఈగం అనే సినిమాలో సుధాకర్ పక్కన విజయశాంతి ,ముచ్చెర్ల అరుణ హీరోయిన్స్ . అంతేకాదు అప్పుడే తమిళంలో అడుగుపెట్టిన సుమలత సైతం సుధాకర్ సరసన హీరోయిన్ గా వేసింది.

అలాగే జయసుధ చెల్లెలు సుభాషిణి కూడా సుధాకర్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఎంజీఆర్ లత,దీప,శోభా,రోజారమణి వంటి స్టార్ హీరోయిన్స్ సుధాకర్ సరసన హీరోయిన్స్ గా నటించారు. ఇలా తమిళనాట ఎంతోమందిని హీరోయిన్స్ గా తన పక్కన లాంచ్ చేసిన సుధాకర్ దారుణ పరిస్థితుల్లో ఉండగా, అతడి పక్కన నటించిన హీరోయిన్స్ హై రేంజ్ కి వెళ్లడం నిజంగా విధిరాత కాక మరేమిటి?