తెల్లజుట్టు రాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెంచే Hair Oil

White Hair tips in telugu : ఈ రోజుల్లో తెల్లజుట్టు సమస్య అనేది చిన్న వయస్సులో రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇంటిలో తయారుచేసుకొనే నూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక గిన్నెలో 50 ml కొబ్బరి నూనె,ఒక స్పూన్ మెంతులు, అరస్పూన్ లవంగాలు, ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా కలిపి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 10 నిమిషాలు వేడి చేసి చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టుకి బాగా పట్టించి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.
Diabetes tips in telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. తెల్లజుట్టు సమస్య రాగానే కంగారు పడవలసిన అవసరం అసలు లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి తెల్లజుట్టును నివారించటంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.