వీటితో ఇలా చేస్తే జన్మలో ఎలుకలు ఇంట్లోకి రావు
Home remedies to get rid of rats : ఎలుకలు అంటే భయపడని వారు ఉండరు. అవి మనల్ని ఏమీ చేయకపోయినా అన్ని వస్తువులను పాడు చేస్తూ ఉంటాయి. మనిషి గోర్లు ఎలా పెరుగుతాయో అదే విధంగా ఎలుకలకు పళ్ళు అలా పెరుగుతాయి మనం గొర్లను కట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఎలుకలు పెరిగిన పళ్ళను కట్ చేసుకోలేవు అందువల్ల అన్నింటినీ కొరికి పళ్ళను అరగదిస్తూ ఉంటాయి.
ఎలుకలను వదిలించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ లభ్యమవుతాయి కానీ వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచిది.
బిర్యానీ ఆకులు ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెడితే బిర్యానీ ఆకు వాసనకు ఎలుకలు ఆ చుట్టుపక్కలకి కూడా రావు
కలరా ఉండలు కూడా ఎలుకలు ఉండే ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకు ఎలుకలు అటువైపు రావు
ఉల్లిపాయను సగానికి కట్ చేసి ఎలుకలు ఉండే ప్రదేశంలో పెడితే ఎలుకలు ఆ ప్రదేశంలోకి రావు ఉల్లిపాయ నుండి వచ్చే టాక్సిన్ వాసనకి ఎలుకలు పారిపోతాయి
పుదీనా నూనెలో దూది ముంచి ఎలుకలు ఉండే ప్రదేశంలో పెడితే ఘాటైన వాసనకు ఎలుకలు రావు. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే ఎలుకలు ఇంటిలోకి రాకుండా చూసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.