పసుపుతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది
Rose water Face Glow Tips In telugu : ముఖం అందంగా ఉండాలని మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టినా పెద్దగా ప్రయోజనం లేక చాలా నిరాశ చెందుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక ప్యాక్ గురించి తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,పావు స్పూన్ లో సగం పసుపు వేసి సరిపడా రోజ్ వాటర్ పోసి పేస్ట్ మాదిరిగా కలపాలి. ముఖం శుభ్రంగా కడిగి తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. చర్మం మీద మృత కణాలను,దుమ్ము,ధూళి వంటి వాటిని తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శనగపిండిలో ఉండ్ జింక్ చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును తొలగిస్తుంది. శనగపిండిలో (besan flour) ఆల్కలైజింగ్ లక్షణాలను కలిగి ఉండుట వలన చర్మ సమతుల్యతను కాపాడుతుంది.
పసుపును కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని అందమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండీ.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.