Beauty Tips

వెల్లుల్లితో ఇలా చేస్తే నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ ఒక్కరోజులో మాయం

Garlic Face Cream : ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం వెల్లుల్లిని ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లిలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్కలు తీసి నీటిలో వేసి ఉడికించాలి.
Young Look In Telugu
ఉడికిన వెల్లుల్లిని నీటితో సహ మిక్సీలో వేసి మిక్సీ చేసి వడకట్టాలి. ఈ వెల్లుల్లి నీటిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లౌర్ వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం క్రీమ్ గా మారుతుంది. ఈ క్రీమ్ చల్లారాక ఒక బౌల్ లో తీసుకొని దానిలో పావు స్పూన్ లో సగం విటమిన్ E ఆయిల్, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి.
Garlic Health Benefits
ఈ క్రీమ్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా పది రోజులు నిల్వ ఉంటుంది. ఈ క్రీమ్ ని ప్రతి రోజు ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా పది రోజుల పాటు చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.