15 రోజుల్లో జుట్టు రాలే సమస్య,చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Fall : జుట్టు రాలే సమస్య, చుండ్రు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న సమస్యలు. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా సహజసిద్దంగా మన ఇంటిలో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ పొడి, రెండు స్పూన్ల ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
ఆముదం నూనెను పూర్వ కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా నల్లగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది. పెరుగులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇవ్వటమే కాకుండా తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ కి ఉపయోగించిన అన్నీ పదార్ధాలు సులభంగానే అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.