ఈ 1 చిట్కా పాటిస్తే చాలు కేవలం 3 రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అవుతాయి
Cracked Heels : పాదాల పగుళ్లు అనేవి పొడి గాలి, తేమ సరిగా లేకపోవటం, పాదాలపై సరైన శ్రద్ద పెట్టకపోవటం వంటి కారణాలతో వస్తాయి. పాదాల పగుళ్లను అశ్రద్ద చేయకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు,ధైరాయిడ్ సమస్య ఉన్నవారు అసలు అశ్రద్ద చేయకుండా పాదాల పగుళ్లను తగ్గించుకోవాలి. వీరిలో ఎక్కువగా పాదాల పగుళ్ళ సమస్య కనపడుతుంది.
పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో పాదాల పగుళ్ళ సమస్య నుండి బయట పడవచ్చు. చిట్కా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక స్పూన్ ఆవిసే గింజలను నీటిలో అరగంట నానబెట్టాలి. ఇలా నానబెడితే జెల్ వస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, అరస్పూన్ తేనె,ఒక vitamin e capsule ఆయిల్,అరస్పూన్ గ్లిజరిన్,ఒక స్పూన్ ఆవిసే గింజల జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాయటానికి ముందు పాదాలను పది నిమిషాలు గోరువెచ్చని నీటిలో ఉంచి శుభ్రంగా తుడవాలి.
ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.