తెల్లజుట్టు నల్లగా మారాలంటే….ఏమి చేయాలి
White Hair to Black hair :తెల్లజుట్టుకు రంగు వేసి ఎంతకాలం దాస్తారు? మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్లజుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. బ్లాక్ టీ
ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ బ్లాక్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ఈ విధంగా చేస్తే నిదానంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
2. గోరింటాకు
గోరింటాకు ఆకుల్ని మెత్తని పేస్ట్ గా చేసుకొని ,దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి, మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక షాంపూతో తలస్నానము చేయాలి.
3. కొబ్బరినూనె
ఒక బౌల్ లో ఆరు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని దానిలో మూడు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తరువాత షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.