Kitchen

వేసవిలో పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే…ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

Kitchen Tips :మనం ప్రతిరోజు వంటింట్లో పచ్చిమిర్చి వాడుతూ ఉంటాం. పచ్చిమిర్చి లేనిదే వంట పూర్తి కాదు. అయితే వేసవికాలంలో పచ్చిమిర్చి చాలా తొందరగా వడిలి పోతాయి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.
Green chilli5
పచ్చిమిర్చి వారం నుంచి రెండు వారాలు నిల్వ ఉండాలంటే జిప్ లాక్ కవర్ లో స్టోర్ చేయాలి. పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి జిప్‌లాక్‌ బ్యాగ్‌ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. అలాగే నెల రోజుల పాటు నిల్వ ఉండాలంటే…పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పేపర్‌ టవల్‌పై ఆరబెట్టండి.
Green chilli
పచ్చిమిర్చి తొడిమలు తీసి, గాలి చొరబడని డబ్బాలో పేపర్‌ టవల్‌ వేసి, పైన పచ్చిమిర్చి వేయాలి. దానిపై మళ్లీ పేపర్‌ టవల్‌ లేయర్‌ వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.