తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారటం ఖాయం… ఒక్కసారి ట్రై చేయండి
White Hair Turn black:ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. తెల్లజుట్టు సమస్యను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. తెల్ల జుట్టు రావటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. తెల్ల జుట్టు రావటం ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూను ఉసిరి పొడి, ఒక స్పూను బ్లాక్ టీ పొడి వేసి బాగా కలిపి తగినంత నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే వీటిలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా జుట్టు కుదుళ్లను ప్రోత్సహిస్తుంది.దాంతో జుట్టు ఆరోగ్యంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.