Kitchen

వంటింటిలో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు

Kitchen Tips in telugu: వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట త్వరగా అవ్వటమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా సమయం కూడా అదా అవుతుంది. వంటింటిలో గృహిణులకు ఉపయోగపడే చిట్కాలను తెలుసుకుందాం.

మనలో చాలా మంది చేదుగా ఉంటుందని కాకరకాయని తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే కాకరకాయలో చేదు తగ్గుతుంది. కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది.

అప్పడాలను వేయించే ముందు పది నిమిషాలు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది.

ఒకప్పుడు మైదా పిండితో చిప్స్ చేసేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఆరోగ్యానికి మైదా మంచిది కాదని గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నాము. గోధుమ పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.
garlic Health benefits
వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.

బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.

దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.