డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి
How to Store Nuts and Dried Fruits : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకున్నారు. అయితే ఒక్కోసారి తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిని నిల్వ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.
Dry Fruits కొనుగోలు చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో డ్రై ఫ్రూట్స్‌ను ఉంచండి. దీనితో అవి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి పైగా ఇలా ఎయిర్ టైట్ వాటిలో పెట్టడం వల్ల చీమలు వంటివి రావు. వీటిని ఎప్పుడూ కూడా చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచకూడదు. అలాగే డైరెక్ట్ సూర్య కిరణాలు తగిలేలా పెట్టారంటే అవి త్వరగా పాడైపోతాయి.
అందుకని వీలైనంత వరకూ చల్లటి మరియు పొడి ప్రదేశంలో ఉంచండి. అప్పుడు Dry Fruits ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. లేదంటే త్వరగా పాడై పోతాయి. ఓవెన్‌లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు టోస్ట్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఓవెన్ లేనివారు పాన్‌లో కూడా ఫ్రై చేయొచ్చు.
చాలా మంది స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలలో పెడుతూ ఉంటారు. కానీ బెటర్ ఆప్షన్ ఏమిటంటే గాజు సీసాలు. గాజు సీసాలో డ్రై ఫ్రూట్స్‌ని పెడితే ఎక్కువ కాలం పాడై పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చూసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.