వంట చేసే ప్రతి మహిళకు ఉపయోగపడే కిచెన్ టిప్స్
Kitchen Tips in telugu :వంట చేసే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట తొందరగా అవ్వటమే కాకుండా ఎంతో రుచిగా వస్తుంది. చాలా సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం.
కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి…కరివేపాకు ఆకులను సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రీజ్లో ఉంచితే చెడిపోకుండా ఉంటాయి.
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
అన్నం ఉడికేటప్పుడు ఆ బియ్యంలో కొద్దిగా నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉడుకుతుంది.
గోధుమ రవ్వ, మైదా పిండి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది.
యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో కలిపి టీలో వేస్తే టీ రుచిగానూ, సువాసనగామా ఉంటుంది. నిద్ర సారిగా పట్టని వారు ఈ టీ తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.