Beauty Tips

ఈ సింపుల్ టిప్ పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…తెల్లజుట్టు రమ్మన్నా రాదు

White Hair Home Remedies In Telugu :మారిన జీవనశైలి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం వలన కంగారుపడి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై లు వాడుతూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా పనిచేసిన వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

అలా రాకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలంటే మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
Usirikaya benefits
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి ఒక గుప్పెడు కరివేపాకు. ఆకులు, నాలుగు రాతి ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి . ఇలా మరిగించడం వల్ల కరివేపాకు లోని పోషకాలు ఉసిరికాయలోని పోషకాలు నీటిలోకి చేరతాయి ఈ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
Curry Leaves Health benefits In telugu
ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడి వేసుకుని ఆ తర్వాత ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నా కరివేపాకు ఉసిరికాయ నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట అలా ఉంచేసి ఆ తర్వాత తలకు పట్టించి ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
henna leaf
ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అయితే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటె ఎక్కువ వారాల సమయం పడుతుంది. అదే తెల్ల జుట్టు తక్కువగా ఉంటే మాత్రం తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.