యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఈ ఆకు తీసుకుంటే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…
uric acid problem Tippateega : ఈ మధ్యకాలంలో మనలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో మోతాదుకు మించి ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. .
ఈ సమస్యలు ఉన్నప్పుడు ముందుగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకోవాలి. దాన్నిబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఆయుర్వేద రెమిడీని కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి తిప్పతీగ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక తిప్పతీగ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మరుసటి రోజు ఉదయం ఆకులతో సహా ఈ నీటిని మరిగించాలి. ఈ నీటిని వడగట్టి తాగాలి. తిప్పతీగను జ్యూస్, పౌడర్స్, టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయాలి. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పండ్లను తినాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
తిప్పతీగ శరీరంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద షాపుల్లో కూడా తిప్పతీగ పొడి దొరుకుతుంది. దానినైనా కూడా నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిని తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/