Beauty TipsHealth

కేవలం రెండు సార్లు రాస్తే చాలు…జీవితంలో తెల్లజుట్టు సమస్య అసలు ఉండదు…ఇది నిజం

Henna White hair care tips in telugu : తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే Hair Dye లు వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
weight loss tips in telugu
దీని కోసం ముందుగా టీ డికాషన్ తయారుచేసుకోవాలి. టీ డికాషన్ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టాలి. ఒక బౌల్ లో 2 స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ పెరుగు, టీ డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంట సేపు అలా ఉంచేయాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేస్తే ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. హెన్నా తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా,బలంగా ఉండేలా చేస్తుంది.

జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించడం వల్ల జుట్టు ఒత్తుగా, మెరుపుతో ఉంటుంది. టీ డికాషన్ లో ఉండే కెఫీన్ డయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.