కిచెన్ సింక్ కంపు కొడుతుందా… ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు శుభ్రం అవుతుంది
Kitchen Tips In Telugu:వంట గదిలో శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. వంట గదిలో పాత్రలు మరియు సింక్ శుభ్రంగా ఉండటం కూడా ముఖ్యం. అలాగే వంటగదిలో అతి ముఖ్యమైన సింకులో అనేక రకాల పాత్రలు, పదార్థాలను పాడేస్తూ ఉంటాం. అందుకే సింకు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. సింక్ శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.
దీనివల్ల దుర్వాసన వస్తుంది. సింకు శుభ్రంగా ఉండటానికి కొన్ని రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా సింకులో నూనె వంటి జిడ్డు పదార్ధాలను తొలగించడానికి సింక్ లో వేడి నీరు పోసి కొంచెం బ్లీచింగ్ పౌడర్ జల్లి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.
వెనిగర్, నిమ్మరసం సింక్ ని శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది, వీటిలో ఉండే సహజ సిద్ధమైన ఆమ్లం మురికిని చాలా లోతుగా శుభ్రం చేస్తుంది. వెనిగర్, నిమ్మరసం కలిపి సింక్ లో పోసి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే కిచెన్ శుభ్రంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.