Beauty Tips

రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి

Natural Wart Removal Tips In Telugu : పులిపిర్లు అనేవి సాధారణమైన సమస్య. ప్రతి 15 మందిలో ఒక్కరు పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపిర్లను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి యుక్త వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రావటానికి ప్రధానకారణం హ్యూమన్ పాపిలోమా వైరస్.

పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.
amudam
ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం తెల్లని టూత్ పేస్ట్, అరస్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్ల మీద రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రాత్రి సమయంలో అయితే పులిపిర్ల మీద ఈ మిశ్రమాన్ని రాసి, దాని మీద కాటన్ పెట్టి ప్లాస్టర్ వేయాలి. మరుసటి రోజు ఉదయం తీసేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే 3 రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
garlic Health benefits
అలాగే మరొక చిట్కా ఏమిటంటే…చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్ అనేది ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ చేసి పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు. ఇలా 2 రోజులు రాస్తే పులిపిర్లు రాలిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.