5 నిమిషాల్లో ఎంతటి నల్లటి ముఖం అయిన తెల్లగా మారటం ఖాయం
Tomato And sugarface pack In Telugu :మనలో ప్రతి ఒక్కరూ అందంగా మరియు చూడగానే ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
ఒక టమోటా తీసుకొని దానిని కట్ చేసి టమోటా ముక్క మీద పంచదార జల్లి ముఖం మీద రబ్ చేయాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు చేసి అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
టమోటాలో బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్లు సి, ఇ వంటి అనేక యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు ఉండుట వలన టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టమోటా ఒక సహజసిద్దమైన రెమెడీగా ఉపయోగపడుతుంది. చర్మంలో మంట, దద్దుర్లు ఇతర చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించడం.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించడం వంటి గుణాలు పంచదారకు ఉన్నాయి. సౌందర్య సంరక్షణకు పంచదార చాలా బాగా సహాయపడుతుంది. చర్మం మీద పేరుకున్న మృతకణాలను తొలగించడంలో చక్కెర సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది.
చర్మంపై పేరుకున్న మృతకణాలు మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి వంటివి కూడా తొలగిపోతాయి. అధికంగా ఉండే నూనెల్ని కూడా చక్కెర పీల్చేసుకుని జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ముఖం మీద మురికి, దుమ్ము,ధూళి అన్నింటిని తొలగించుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.