కొబ్బరినూనెలో ఈ పొడి కలిపి రాస్తే జీవితంలో తెల్లజుట్టు సమస్య ఉండదు
white hair Home Remedies in telugu :మారిన జీవనశైలి మరియు జుట్టుకి సరైన పోషణ లేకపోవటం మరియు కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది అలా తెల్ల జుట్టు సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.
100 గ్రాములు కొబ్బరి నూనె లో ఒక స్పూన్ టీ పొడి ఒక స్పూన్ కాఫీ పొడి ఏడు చుక్కల నిమ్మరసం వేసి బాగా మరిగించాలి. ఈ నూనె చల్లారాక వడగట్టాలి. ఈ నూనెను నిల్వచేసుకుని నూనె రాసుకోవాలి అనుకున్న ప్రతిసారి ఈ నూనె ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి తలకు రాసుకోవాలి. సాయంత్రం సమయంలో ఈ నూనెను తలకు రాసి మరుసటి రోజు తలస్నానం చేయాలి.
వారంలో మూడు సార్లు నూనె రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నూనె రాసిన ప్రతి సారి తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. సాధారణ కొబ్బరినూనె వాడినట్టుగా ఈ నూనెను కూడా వాడవచ్చు అయితే ఈ నూనె మూడు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది.తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.