పార్టీ లకు,ఫంక్షన్లకు వెళ్లే ముందు ఇలా చేస్తే ఒకే ఒక్క నిమిషంలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది
white hair home remedies in telugu :ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్దాలతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
మనలో చాలా మంది ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీలకు వెళ్లేటప్పుడు తెల్ల జుట్టు ఉన్నప్పుడు అప్పటికప్పుడు డై లు ఉపయోగిస్తూ ఉంటారు కానీ కొంతమంది కెమికల్స్ తో నిండిన డై ఉపయోగించడం ఇష్టంలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టుకు పోషణ కూడా అందుతుంది.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును అప్పటికప్పుడు నల్లగా ఉండే లాగా కవర్ చేస్తుంది. దీనికోసం ఒక ఐరన్ పాన్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. ఈ పొడి నల్లగా మారే వరకూ వేగించాలి. నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొడిని చల్లారనివ్వాలి. చల్లారిన పొడిలో అలోవెరా జెల్ వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. తర్వాత జుట్టును నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. తల దువ్వుకుని పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళవచ్చు తర్వాత రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోయి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఉసిరి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది… లేదంటే ఇంటిలోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. కాబట్టి ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి. కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.