టమోటాతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది
Tomato And Besan Face Glow Tips : అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. అందులో ఒకటే టమోటా .. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వొచ్చో తెలుసుకుందాం..
టమోటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఈ ప్యాక్ లో మరొక ఇంగ్రిడియన్ శనగపిండిని ఉపయోగిస్తున్నాం. ఈ రెండు కూడా చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ టమోటా గుజ్జు, అరస్పూన్ శనగపిండి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు,ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/