జుట్టుకి ఒక్కసారి స్ప్రే చేస్తే జుట్టు రాలటం,పొడి జుట్టు,చుండ్రు సమస్య తొలగిపోతాయి
Onion Hair Fall Tips In telugu : మనలో చాలా మంది మారిన జీవనశైలి మరియు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలడం, చుండ్రు, స్ప్లిట్ , పొడిబారిన జుట్టు, బట్టతల వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి సులభంగా తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల మెంతులను నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెంతుల నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని తొక్క తీసి తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం,మెంతుల నీరు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేయాలి. అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
ఉల్లిపాయ,మెంతులు, ఆముదం ఈ మూడు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి వాటిలో ఉన్న లక్షణాలు సహాయ పడతాయి. వీటిని పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ మూడు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/